Skip to main content

నేవల్‌ డాక్‌యార్డ్‌ అడ్మిరల్‌ సూపరింటెండెంట్‌గాఐ.బి.ఉత్తయ

విశాఖ నేవల్‌ డాక్‌యార్డ్‌ అడ్మిరల్‌ సూపరింటెండెంట్‌గా రియర్‌ అడ్మిరల్‌ ఐ.బి.ఉత్తయ మే 31న బాధ్యతలు స్వీకరించారు.
Current Affairs
ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న శ్రీకుమార్‌ నాయర్‌కు వైస్‌ అడ్మిరల్‌గా పదోన్నతి లభించడంతో ఆయన విశాఖ నేవల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తయ 1987లో ఇండియన్‌ నేవీలో చేరిన ఉత్తయ... నేవీ హెడ్‌క్వార్టర్స్‌లోనే కాకుండా నేవల్‌ డాక్‌యార్డ్‌లో కూడా కీలక విభాగాల్లో అనేక పదవులను అధిరోహించారు. నేవల్‌ డాక్‌యార్డ్‌లో జనరల్‌ మేనేజర్‌ (రీఫిట్‌), ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ (షిప్‌ ప్రొడక్షన్‌)గా ఉన్నారు. రియర్‌ అడ్మిరల్‌గా నియమితులైన తరువాత నేవీ ప్రధాన కార్యాలయంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ సీ బర్డ్‌కు అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (టెక్నికల్‌)గా నియమితులయ్యారు. నేవల్‌ డాక్‌యార్డ్‌లోప్రిన్సిపల్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఉత్తయకువిశిష్ట్‌ సేవా మెడల్‌ (వీఎస్‌ఎం) కూడా దక్కింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : విశాఖ నేవల్‌ డాక్‌యార్డ్‌ అడ్మిరల్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరణ
ఎప్పుడు : మే 31
ఎవరు : రియర్‌ అడ్మిరల్‌ ఐ.బి.ఉత్తయ
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు :ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న శ్రీకుమార్‌ నాయర్‌కు వైస్‌ అడ్మిరల్‌గా పదోన్నతి లభించడంతో...
Published date : 01 Jun 2021 06:17PM

Photo Stories