నేవీలో స్మార్ట్‌ఫోన్లు, ఫేస్‌బుక్‌లపై నిషేధం
Sakshi Education
సమాచారం శత్రుదేశాలకు చేరుతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు, స్మార్ట్‌ఫోన్ల వాడకంపై నావికాదళం డిసెంబర్ 30న నిషేధం విధించింది.
నేవీ సిబ్బంది మొత్తం నౌకలు, నావిక కేంద్రాల్లో వీటిని వాడకూడదని నేవీ అధికారులు తెలిపారు. యుద్ధవిమానాలు, జలాంతర్గాముల రాకపోకల సమాచారాన్ని పాకిస్తానీ ఏజెంట్లకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై పది రోజుల క్రితం నిఘా సంస్థలు ఏడుగురు నేవీ సిబ్బందిని, ఒక హవాలా ఆపరేటర్‌ను అరెస్ట్ చేయడం తెల్సిందే. ముంబై, విశాఖపట్నం, కార్వారల నుంచి వీరిని అరెస్ట్ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సామాజిక మాధ్యమాలు, స్మార్ట్‌ఫోన్ల వాడకంపై నిషేధం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : భారత నావికాదళం
ఎందుకు : ముఖ్య సమాచారం శత్రుదేశాలకు చేరుతున్న నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : సామాజిక మాధ్యమాలు, స్మార్ట్‌ఫోన్ల వాడకంపై నిషేధం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : భారత నావికాదళం
ఎందుకు : ముఖ్య సమాచారం శత్రుదేశాలకు చేరుతున్న నేపథ్యంలో
Published date : 31 Dec 2019 05:33PM