నేషనల్ ట్యాక్స్ కాన్ఫరెన్స్-2020
Sakshi Education
ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (ఏఐఎఫ్‌టీపీ) నిర్వహించిన నేషనల్ ట్యాక్స్ కాన్ఫరెన్స్-2020ని ఉద్దేశించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 6న ప్రసంగించారు.
దేశంలో డిజిటల్ చెల్లింపులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల దేశాభివృద్ధి (జీడీపీ)ని మరింత పక్కాగా మదింపు చేయవచ్చని అన్నారు.
కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో భారత్ వ్యూహం ఫలించిందని, అందుకే ఆర్ధిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రెసిడెంట్ సంగీతా రెడ్డి ఒక కార్యక్రమంలో తెలిపారు.
Published date : 07 Nov 2020 06:06PM