నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2020 విజేత?
Sakshi Education
ఎయిర్ కండీషనర్ల తయారీ అగ్రగామి వోల్టాస్ కంపెనీ... ఇంధన మంత్రిత్వ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు- 2020’ను గెలుచుకుంది.
పరిశ్రమల్లో ఉత్పత్తులకు ఆటంకం కలుగకుండా ఇంధన వినియోగాన్ని తగ్గించే సంస్థలను ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డును అందజేస్తుంది. వరుసగా నాలుగోసారి అవార్డును దక్కించుకోవడం గర్వంగా ఉందని కంపెనీ సీఈవో డెరైక్టర్ ప్రదీప్ బక్షి తెలిపారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ బాధ్యతను ఈ అవార్డు మరింత పెంచిందని బక్షి వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు- 2020
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : ఎయిర్ కండీషనర్ల తయారీ అగ్రగామి వోల్టాస్ కంపెనీ
Published date : 15 Jan 2021 03:46PM