నైపుణ్య శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
Sakshi Education
ప్రతిష్టాత్మక ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,62,000 మంది ఉన్నత విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది.
ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏప్రిల్ 23న వర్చువల్ విధానంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంత భారీ స్థాయిలో మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. ఒప్పందం ప్రకారం... ఏపీలోని 300కుపైగా కాలేజీల్లోని విద్యార్థులు, నైపుణ్య శిక్షణ కేంద్రాల్లోని 1,62,000 మందికి 42 కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,62,000 మంది ఉన్నత విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,62,000 మంది ఉన్నత విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు...
Published date : 24 Apr 2021 06:24PM