Skip to main content

నావికాదళంలో చేరిన స్కార్పియన్‌ తరగతి జలాంతర్గామి పేరు?

భారతీయ నావికాదళంలోకి మూడో స్టెల్త్‌ స్కార్పియన్‌ తరగతి జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ చేరింది. మార్చి 10న ముంబైలోని నేవీ డాక్‌యార్డులో ఈ కార్యక్రమం జరిగింది.
Current Affairsనేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ నేవీ చీఫ్‌ వీఎస్‌ షెకావత్‌ హాజరయ్యారు. వెస్టర్న్‌ నావల్‌ కమాండ్‌లో ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ పనిచేయనుంది.

డీజిల్, విద్యుత్‌ ఆధారితంగా....
ఇప్పటి వరకు ఆరు స్కార్పియన్‌ క్లాస్‌ జలాంత ర్గాములను మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ తయారు చేసింది. నేవీలోకి చేరిన మూడో కలావరి క్లాస్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కరంజ్‌... డీజిల్, విద్యుత్‌ ఆధారితంగా పనిచేస్తుంది. సముద్ర ఉపరితలంలో పాటు నీటి అడుగు నుంచి వచ్చే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ, సెన్సార్లు ఈ జలాంతర్గామిలో ఉన్నాయి.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
నావికాదళంలో చేరిన స్కార్పియన్‌ తరగతి జలాంతర్గామి?
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : ఐఎన్‌ఎస్‌ కరంజ్‌
ఎక్కడ : నేవీ డాక్‌యార్డు, ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు
Published date : 12 Mar 2021 09:22AM

Photo Stories