Skip to main content

నాట్య మయూరి అన్నపూర్ణాదేవి ఇకలేరు

ప్రఖ్యాత నాట్య కళాకారిణి లంక అన్నపూర్ణాదేవి (70) క‌న్నుమూశారు.
Current Affairs

నాట్యమయూరి, కళానిధి, కళాప్రపూర్ణ బిరుదులందుకున్న ఆమె విజయవాడ రామవరప్పాడులోని వృద్ధాశ్రమంలో మార్చి 31న తుదిశ్వాస విడిచారు. నాట్య కళాకారిణిగా జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని విజేతగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చారు.


అన్నపూర్ణాదేవి జీవన నేపథ్యమిదీ..
  • కృష్ణా జిల్లా గుడివాడలో లక్ష్మీనారాయణ, సుబ్బలక్ష్మి దంపతులకు 1949 మే నెలలో జన్మించిన లంక అన్నపూర్ణాదేవి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.
  • చిన్నప్పుడే ఆమె చింతా సీతారామాంజనేయులు, భాగవతుల రామతారకం వద్ద భరత నాట్యం నేర్చుకున్నారు. కూచిపూడి కులపతి చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చారు.
  • 1962లో భారత్‌–చైనా యుద్ధ సమయం లో దేశ సరిహద్దులకు వెళ్లి సైనికులలో ఉత్తేజం నింపేలా నాట్య ప్రదర్శనలిచ్చారు. ఇందుకు గాను నాటి ప్రధానులు నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ అభినందనలు అందుకున్నారు.
  • 1973లో రైలు ప్రమాదంలో అన్నపూర్ణకు ఒక కాలు మోకాలి వరకు తెగిపోగా, మరో కాలు మడమ వరకు దెబ్బతింది.
  • ఆ తరువాత కొయ్య కాలు అమర్చుకుని దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రఖ్యాత నాట్య కళాకారిణి క‌న్నుమూత
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : లంక అన్నపూర్ణాదేవి (70)
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అనారోగ్యం కార‌ణంగా
Published date : 02 Apr 2020 02:13PM

Photo Stories