Skip to main content

నార్త్ అమెరికన్ ఓపెన్ టోర్ని విజేతగా మానవ్

అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) చాలెంజ్ సిరీస్ నార్త్ అమెరికన్ ఓపెన్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్ మానవ్ ఠక్కర్ విజేతగా నిలిచాడు.
Current Affairsకెనడాలో జరిగిన ఈ టోర్నీలో మానవ్ పురుషుల అండర్-21 సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. ఫైనల్లో మానవ్ 11-3, 11-5, 11-6తో మార్టిన్ బెన్‌టాన్‌కోర్ (అర్జెంటీనా)పై విజయం సాధించాడు. అండర్-21 విభాగంలో ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ సాధించిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా మానవ్ గుర్తింపు పొందాడు. గతంలో సత్యన్ జ్ఞానశేఖరన్ (2012-బ్రెజిల్ ఓపెన్), హర్మీత్ దేశాయ్ (2012-ఈజిప్ట్ ఓపెన్), సౌమ్యజిత్ ఘోష్ (2011-చిలీ ఓపెన్) ఈ ఘనత సాధించారు.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
ఐటీటీఎఫ్ చాలెంజ్ సిరీస్ నార్త్ అమెరికన్ ఓపెన్ టోర్నమెంట్ విజేత
 ఎప్పుడు  : డిసెంబర్ 8
 ఎవరు  : మానవ్ ఠక్కర్
 ఎక్కడ  : కెనడా
Published date : 09 Dec 2019 05:48PM

Photo Stories