నాగాలాండ్ మాజీ గవర్నర్ అశ్వనీ కుమార్ కన్నుమూత
Sakshi Education
సీబీఐ మాజీ డెరైక్టర్, నాగాలాండ్ మాజీ గవర్నర్, అశ్వనీ కుమార్ (69) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సిమ్లాలోని ఆయన స్వగృహంలో అక్టోబర్ 7న ఉరి వేసుకొని మరణించారని అధికారులు చెప్పారు. ఆయన గదిలో సూసైడ్ నోట్ లభించింది. జీవితంపై విరక్తి చెందినట్లు సూసైడ్ నోట్‌లో రాశారు. 1973 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అశ్వనీ కుమార్ 2008లో సీబీఐ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసు విచారణకు నేతృత్వం వహించారు. 2013లో అప్పటి యూపీఏ హయాంలో నాగాలాండ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీబీఐ మాజీ డెరైక్టర్, నాగాలాండ్ మాజీ గవర్నర్ కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : అశ్వనీ కుమార్ (69)
ఎక్కడ : సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్
ఎందుకు : ఆత్మహత్యకు పాల్పడటంతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీబీఐ మాజీ డెరైక్టర్, నాగాలాండ్ మాజీ గవర్నర్ కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : అశ్వనీ కుమార్ (69)
ఎక్కడ : సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్
ఎందుకు : ఆత్మహత్యకు పాల్పడటంతో
Published date : 08 Oct 2020 05:24PM