మయన్మార్‌కు భారత్ అందించనున్న జలాంతర్గామి పేరు?
Sakshi Education
మయన్మార్ నౌకా దళానికి ‘ఐఎన్‌ఎస్ సింధువీర్(s58)’ అనే జలాంతర్గామిని అందించాలని భారత్ నిర్ణయించింది.
దీంతో మయన్మార్ నౌకాదళంలో తొలి జలాంతర్గామిగా సింధువీర్ నిలవనుంది. దక్షిణాసియా ప్రాంతంలో అన్ని దేశాల భద్రత, వృద్ధి కోసం చేపట్టిన ‘సాగర్’ దార్శనికతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘కిలో తరగతికి చెందిన ఐఎన్‌ఎస్ సింధువీర్‌ను మయన్మార్‌కు ఇవ్వనున్నాం. పొరుగు దేశాల స్వయం సమృద్ధి, సామర్థ్య పెంపునకు చర్యలు చేపడతాం’’ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. డీజిల్-విద్యుత్‌తో పనిచేసే కిలో తరగతి జలాంతర్గామిని శత్రువుపై మెరుపు దాడి చేసేందుకు ఉపయోగిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మయన్మార్ నౌకా దళానికి భారత్ అందజేయనున్న జలాంతర్గామి పేరు
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : ఐఎన్‌ఎస్ సింధువీర్(s58)
ఎందుకు : దక్షిణాసియా ప్రాంతంలో అన్ని దేశాల భద్రత కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : మయన్మార్ నౌకా దళానికి భారత్ అందజేయనున్న జలాంతర్గామి పేరు
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : ఐఎన్‌ఎస్ సింధువీర్(s58)
ఎందుకు : దక్షిణాసియా ప్రాంతంలో అన్ని దేశాల భద్రత కోసం
Published date : 20 Oct 2020 05:40PM