Skip to main content

మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ విజేత?

మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ పురుషుల విభాగంలో పోలాండ్‌ ప్లేయర్‌ హుబర్ట్‌ హుర్కాజ్‌ చాంపియన్‌గా అవతరించాడు.
Current Affairs
అమెరికాలోని ప్లోరిడా రాష్ట్రం డెల్‌రే బీచ్‌లో ఏప్రిల్‌ 5న జరిగిన ఫైనల్లో హుర్కాజ్‌ 7–6 (7/4), 6–4తో ఇటలీకి చెందిన 19 ఏళ్ల జానిక్‌ సినెర్‌పై గెలుపొందాడు. హుర్కాజ్‌ కెరీర్‌లో ఇదే తొలి మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌. విజేతగా నిలిచిన హుర్కాజ్‌కు 3,00,110 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 22 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

మూడు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలు రద్దు
అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో 2021 ఏడాది జరగాల్సిన మూడో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తెలిపింది. జూన్‌లో జరగాల్సిన కెనడా ఓపెన్‌... జూలైలో జరగాల్సిన రష్యా ఓపెన్‌... అక్టోబర్‌లో జరగాల్సిన ఇండోనేసియా మాస్టర్స్‌ టోర్నీలు రద్దయినట్లు బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ(పురుషుల విభాగం) విజేత?
ఎప్పుడు : ఏప్రిల్‌ 5
ఎవరు : హుబర్ట్‌ హుర్కాజ్‌
ఎక్కడ : డెల్‌రే బీచ్, ప్లోరిడా రాష్ట్రం, అమెరికా
Published date : 06 Apr 2021 06:20PM

Photo Stories