ముందస్తు ఎన్నికలకు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం
Sakshi Education
బ్రెగ్జిట్ సంక్షోభాన్ని నివారించడానికి బ్రిటన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది.
ఈ మేరకు ముందస్తు ఎన్నికల ప్రతిపాదనపై అక్టోబర్ 30న చర్చించిన హౌస్ ఆఫ్ కామన్స్ 438-20 తేడాతో ఆమోద ముద్ర వేసింది. దీంతో 2019, డిసెంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానమంత్రి ఎంపీల మద్దతుతో మాత్రమే ఆ పని చేయగలరు.
బ్రెగ్జిట్‌పై 2019, అక్టోబర్ 31న వరకు ఉన్న గడువును 2020, జనవరి 31వ తేదీ వరకు పొడిగించేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) అక్టోబర్ 28న ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్‌లో గత నాలుగేళ్లలో మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. 2015, 2017లో ఎన్నికలు జరిగాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ముందస్తు ఎన్నికలకు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : బ్రిటన్ పార్లమెంటు
ఎందుకు : బ్రెగ్జిట్ సంక్షోభాన్ని నివారించడానికి

Published date : 31 Oct 2019 05:41PM