Skip to main content

ముంబైలో మూడు మెట్రోలైన్ పనులు ప్రారంభం

ముంబైలో రూ.19,080 కోట్ల విలువైన మూడు మెట్రోలైన్ పనులతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 7న శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 21వ శతాబ్దపు ప్రపంచానికి తగ్గట్లు మన నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. దేశ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ప్రకటించారు.

మరోవైపు ఔరంగాబాద్‌లో మహిళా స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ)ను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. జల్ జీవన్ మిషన్’ కింద రాబోయే 5 సంవత్సరాల్లో రూ.3.5 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నామన్నారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ పట్టణం, 10,000 ఎకరాల్లో విస్తరించిన ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీని మోదీ ఆవిష్కరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మూడు మెట్రోలైన్ పనులు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
Published date : 09 Sep 2019 05:41PM

Photo Stories