Skip to main content

ముఖాన్ని కప్పే అన్ని రకాల ముసుగులపై నిషేధం విధించిన దక్షిణాసియా దేశం?

బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పే అన్ని రకాల ముసుగులపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది.
Current Affairs
జాతీయ భద్రతను కారణంగా పేర్కొంటూ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయానికి లంక కేబినెట్‌ ఏప్రిల్ 27న ఆమోదం తెలిపింది. అయితే కరోనాను అడ్డుకునేందుకు ధరించే ఫేస్‌ మాస్కులకు ఈ నిషేధం వర్తించదు. ముఖ ముసుగుల్లో బురఖా, నికాబ్‌ కూడా వస్తాయి. ఈ నిర్ణయం చట్టరూపం దాల్చాలంటే పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంది. ముసుగుల నిషేధ నిర్ణయంపై గతనెల్లో లంకలో పాకిస్తాన్ రాయబారి సాద్‌ ఖతక్‌ విమర్శలు గుప్పించారు. భద్రత పేరిట ఇలాంటి చర్యలు ముస్లింల సెంటిమెంట్‌ను దెబ్బతీయడమే కాకుండా, లంకలో మైనార్టీల ప్రాథమిక హక్కుల అణిచివేతకుదోహదమవుతాయని తెలిపారు. 2019లో శ్రీలంకలో తాత్కాలికంగా బురఖాలపై నిషేధం విధించారు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా గొటబయరాజపక్స, ప్రధానమంత్రిగా మహిందరాజపక్స ఉన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పే అన్ని రకాల ముసుగులపై నిషేధం విధించిన దక్షిణాసియా దేశం?
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : శ్రీలంక
ఎక్కడ :శ్రీలంక
ఎందుకు : జాతీయ భద్రత అంశాన్ని దృష్టిలో ఉంచుకుని...
Published date : 28 Apr 2021 06:40PM

Photo Stories