Skip to main content

ముగిసిన భారత్‌–అమెరికా నేవీ విన్యాసాలు

హిందూ మహాసముద్రంలో భారత్‌–అమెరికా నేవీ సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాలు జూన్‌ 24వ తేదీతో ముగిశాయి.
Current Affairs
రెండు రోజుల పాటు జరిగిన ఈ విన్యాసాల్లో పి–81, మిగ్‌ 29కే ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు ఇండియన్‌ నేవీ షిప్స్‌ కొచి, టెగ్‌లు పాల్గొన్నాయి. అమెరికా షిప్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కలిసి నేవీ అధికారులు అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్, క్రాస్‌ డెక్‌ హెలీకాఫ్టర్‌ ఆపరేషన్స్, యాంటీ సబ్‌మెరైన్‌ ప్రదర్శనలు చేశారు. మారిటైమ్‌ ఆపరేషన్స్‌లో భాగంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు, నావికా సామర్థ్యం, రక్షణ రంగాల్లో భాగస్వామ్యం వంటి అంశాల బలోపేతానికి ఈ విన్యాసాలు నిర్వహించారు.

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 11 ఆవిష్కరణ
టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ జూన్‌ 24న తమ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో కొత్త వెర్షన్‌ విండోస్‌ 11ను ఆవిష్కరించింది. మరింత సరళతరమైన డిజైన్‌తో రూపొందించిన ఈ ఓఎస్‌.. 2021 ఏడాది ఆఖరు నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 2015లో విండోస్‌ 10 ప్రవేశపెట్టిన ఆరేళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్‌ ఈ కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించింది. విండోస్‌కి సంబంధించి ఇది కొత్త శకమని వర్చువల్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : నేవీ విన్యాసాలు నిర్వహణ
ఎప్పుడు : జూన్‌ 24
ఎవరు : భారత్‌–అమెరికా
ఎక్కడ : హిందూ మహాసముద్రం
ఎందుకు : ఇరుదేశాల మధ్య సంబంధాలు, నావికా సామర్థ్యం, రక్షణ రంగాల్లో భాగస్వామ్యం వంటి అంశాల బలోపేతానికి...
Published date : 25 Jun 2021 06:35PM

Photo Stories