మూడో కరోనా వైరస్ వ్యాక్సిన్‌కి చైనా అనుమతి
Sakshi Education
కరోనా వైరస్‌పై పోరాడేందుకు మూడో వ్యాక్సిన్ ‘ఇనాక్టివేటెడ్’కు సంబంధించి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ (మానవులపై వ్యాక్సిన్ పరీక్షలు)కు చైనా అనుమతినిచ్చింది.
చైనా జాతీయ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్), వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) నేతృత్వంలో వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయొలాజికల్ ప్రొడక్ట్స్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అలాగే వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైతం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్టు చైనా ప్రభుత్వ జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. తమ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కి కూడా పంపిస్తున్నామనీ, అది పూర్తివడానికీ, ఎంత సురక్షితమైందో, సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఏడాది పడుతుందని సినోఫామ్ తెలిపింది.
Published date : 27 Apr 2020 07:21PM