Skip to main content

మత మార్పిడిని నిరోధించే బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రం?

వివాహం ద్వారా గానీ లేదా ఇతర తప్పుడు పద్ధతుల్లో మత మార్పిడికి పాల్పడడాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించిన ‘‘మత స్వేచ్ఛ(ఫ్రీడం ఆఫ్ రిలిజియన్) బిల్లు-2020’’కు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదించింది.
Current Affairs
ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా డిసెంబర్ 26న వెల్లడించారు. ఇది అమల్లోకి వచ్చి చట్టరూపం దాలిస్తే, చట్ట ఉల్లంఘనకు అత్యధికంగా పదేళ్ళ జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు.

మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదించిన బిల్లు ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్ ఆర్డినెన్స్, 2020ని పోలి ఉంది.

మధ్యప్రదేశ్ రాజధాని: భోపాల్
మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్: ఆనందీబెన్ పటేల్
మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి: శివరాజ్ సింగ్ చౌహాన్

ఉత్తరప్రదేశ్ రాజధాని: లక్నో
ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్: ఆనందీబెన్ పటేల్
ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి: యోగి ఆదిత్యానాథ్

క్విక్ రివ్యూ :

ఏమిటి : మత స్వేచ్ఛ(ఫ్రీడం ఆఫ్ రిలిజియన్) బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : మధ్యప్రదేశ్ కేబినెట్
ఎందుకు : వివాహం ద్వారా గానీ లేదా ఇతర తప్పుడు పద్ధతుల్లో మత మార్పిడికి పాల్పడడాన్ని అడ్డుకునేందుకు
Published date : 28 Dec 2020 05:59PM

Photo Stories