Skip to main content

మసూద్ అజార్‌పై ఐరాసలో తీర్మానం

జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలని పేర్కొంటూ మార్చి 28న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది.
మసూద్‌కు చెందిన ఆస్తులు జప్తు చేసేలా, అతడు ఎక్కడికీ ప్రయాణించకుండా నిషేధాజ్ఞలు విధించాలని కోరింది. అల్‌ఖైదా ఉగ్రసంస్థతో మసూద్‌కు సంబంధాలు ఉన్నాయని, ఆర్థికంగా, ప్రణాళికలు రచించడంలో, ఆయుధాల సరఫరా చేయడంలో మసూద్ సహాయం అందిస్తున్నాడని, జైషేమహ్మద్‌కు సహాయసహకారాలు అందిస్తున్నాడని తీర్మానంలో అమెరికా పేర్కొంది. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, బ్రిటన్‌లు మద్దతు తెలిపాయి. ఈ తీర్మానంపై ఎప్పుడు ఓటింగ్ జరుగుతుందనే విషయంపై స్పష్టతలేదని ఐరాస వర్గాలు చెబుతున్నాయి.

15 మంది (10+5) సభ్యులున్న ఐరాస భద్రతామండలిలో తీర్మానం పాస్ కావాలంటే తొమ్మిది ఓట్లు కావాలి. అందులో శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు తీర్మానాన్ని అడ్డుకుంటూ ఒక్క వీటో కూడా వేయకూడదు. అప్పుడే ఆ తీర్మానానికి ఆమోద ముద్ర పడుతుంది. ఇప్పటికే అజార్ పై ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టగా చైనా తన వీటీ అధికారంతో అడ్డుకుంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మసూద్ అజార్‌పై ఐరాసలో తీర్మానం
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : అమెరికా
ఎందుకు : అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలని
Published date : 29 Mar 2019 05:24PM

Photo Stories