మొట్టమొదటి టీఎక్స్2 అవార్డును గెలుచుకున్న దేశం?
Sakshi Education
తక్కువ సమయంలోనే పులుల సంఖ్యను రెండింతలు చేసినందుకుగానూ... ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్(పీటీఆర్)కు ‘టీఎక్స్2 అవార్డు’ లభించింది.
దీంతో ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. పులులను జాగ్రత్తగా పర్యవేక్షించడం, దాడులను తగ్గించడం ద్వారా పులుల సంఖ్యను పెంచినట్లు పీటీఆర్ అధికారులు తెలిపారు.
టీఎక్స్2 అవార్డు- విశేషాలు...
- 2010లో పులులను రక్షించేందుకు, వాటి సంఖ్యను పెంచేందుకు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదికగా టీఎక్స్2 గ్లోబల్ అవార్డును ఏర్పాటు చేశారు. ఇందులో టైగర్ రిజర్వ్‌లు ఉన్న 13 దేశాలు పోటీ పడ్డాయి.
- 2010లో ఉన్న పులుల సంఖ్యను 2022 నాటికి రెండింతలు చేయాలన్నది ఈ అవార్డు అసలు లక్ష్యం.
- యూపీలోని పీటీఆర్ 2018 నాటికే ఈ ఘనతను సాధించింది.
- 2014 లెక్కల ప్రకారం పిలిభిత్‌లో 25 పులులున్నాయి. అవి 2018 నాటికి 65కు చేరుకున్నాయి.
చదవండి: ప్రపంచ పులుల దినోత్సవం ఎప్పడు? భారత్‌లో మొత్తం పులుల సంఖ్య ఎంత? దేశంలో అత్యధిక పులులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ యాప్ సహాయంతో భారత్ పులుల సంఖ్యను లెక్కించింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొట్టమొదటి టీఎక్స్2 అవార్డును గెలుచుకున్న దేశం
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : భారత్
ఎక్కడ : ప్రపంచంలో
ఎందుకు : ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్(పీటీఆర్)లో పులుల సంఖ్యను రెట్టింపు చేసినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొట్టమొదటి టీఎక్స్2 అవార్డును గెలుచుకున్న దేశం
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : భారత్
ఎక్కడ : ప్రపంచంలో
ఎందుకు : ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్(పీటీఆర్)లో పులుల సంఖ్యను రెట్టింపు చేసినందుకు
Published date : 25 Nov 2020 05:57PM