మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీగా కోహ్లి
Sakshi Education
భారత్‌లో ‘మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్’గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండో ఏడాది నిలిచాడు.
ఈ మేరకు డఫ్ అండ్ ఫెల్ఫస్ సంస్థ ఒక జనవరి 10న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 18 శాతం పెరుగుదలతో 2018లో కోహ్లి బ్రాండ్ విలువ దాదాపు రూ.1,200 కోట్లు (170.9 మిలియన్ అమెరికన్ డాలర్లు) అయింది. కోహ్లి 2018, నవంబరు వరకు 24 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నాడు.
అదే విధంగా 21 ఉత్పత్తులను ఎండార్స్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోన్ రూ.718 కోట్ల (102.5 మిలియన్ అమెరికన్ డాలర్లు) బ్రాండ్ విలువతో రెండో స్థానం దక్కించుకుంది. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ (రూ.473 కోట్లు), రణ్‌వీర్ సింగ్ (రూ.443 కోట్లు) మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లో మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : విరాట్ కోహ్లి

Published date : 11 Jan 2019 06:13PM