Skip to main content

మోదీ, పుతిన్‌లతో జిన్‌పింగ్ భేటీ

జి-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో చైనా అధినేత జిన్‌పింగ్ భేటీ కానున్నారు.
జపాన్‌లోని ఒసాకాలో జూన్ 28, 29వ తేదీల్లో జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దిగుమతులపై భారీగా పన్నులు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష, రక్షణాత్మక విధానాలపై ఈ సందర్భంగా వీరు ప్రముఖంగా చర్చిస్తారని చైనా అధికారులు తెలిపారు. భారత్, రష్యాలతోపాటు బ్రిక్స్‌లోని ఇతర సభ్య దేశాలు బ్రెజిల్, దక్షిణాఫ్రికాలతోనూ జిన్‌పింగ్ చర్చలు జరుపుతారని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో భేటీ
ఎప్పుడు : జూన్ 28, 29వ తేదీల్లో
ఎవరు : చైనా అధినేత జిన్‌పింగ్
ఎక్కడ : ఒసాకా, జపాన్
Published date : 25 Jun 2019 06:00PM

Photo Stories