మంగళగిరిలో వోల్టీ ఐవోటీ తయారీ కేంద్రం
Sakshi Education
జీపీఎస్, ఐవోటీ పరికరాల తయారీ సంస్థ వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో తయారీ ప్లాంటును నెలకొల్పనుంది.
దాదాపు రూ.50 కోట్లతో, రోజుకు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ ఫౌండర్ కోణార్క్ చుక్కపల్లి నవంబర్ 25న తెలిపారు. 2020 జూలై నాటికి ఈ కేంద్రంలో తయారీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా 400-500 మందికి ఉపాధి లభించనుంది. వోల్టీ సంస్థకు హైదరాబాద్‌లో1000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంటు ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ తయారీ కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : వోల్టీ సంస్థ ఫౌండర్ కోణార్క్ చుక్కపల్లి
ఎక్కడ : మంగళగిరి, గుంటురూ జిల్లా, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ తయారీ కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : వోల్టీ సంస్థ ఫౌండర్ కోణార్క్ చుక్కపల్లి
ఎక్కడ : మంగళగిరి, గుంటురూ జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 26 Nov 2019 05:43PM