Skip to main content

మలబార్ రెండో దశ విన్యాసాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?

24వ మలబార్ రెండో దశ యుద్ధ విన్యాసాలు-2020 నవంబర్ 17న ఉత్తర అరేబియా సముద్రంలో ప్రారంభమయ్యాయి.
Current Affairs
నవంబర్ 20 వరకు జరగనున్న ఈ నావికాదళ విన్యాసాల్లో భారత నౌకాదళం, యునెటైడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్)తోపాటు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్‌ఏఎన్) నౌకాదళం పాల్గొన్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో తొలిసారిగా ‘నాన్ కాంటాక్ట్-ఎట్ సీ’ పద్ధతిలో విన్యాసాలు చేపట్టారు. మలబార్ ఎక్సర్‌సైజ్ ద్వారా నాలుగు దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని భారత రక్షణశాఖ పేర్కొంది.

బంగాళాఖాతంలో తొలి దశ...
24వ మలబార్ తొలి దశ విన్యాసాలు 2020, నవంబర్ 3 నుంచి 6వ తేదీ వరకూ బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో జరిగాయి. ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్, ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్‌మెరైన్లు భారత్ తరఫున ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. యునెటైడ్ స్టేట్స్ నేవీకి చెందిన యూఎస్‌ఎస్ జాన్ మెక్‌కై న్, హెచ్‌ఎంఏఎస్ బలారత్, జపాన్‌కు చెందిన జేఎస్ ఒనామీతో పాటు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు విన్యాసాల్లో కనువిందు చేశాయి.

1992లో ప్రారంభం...
ఇండో-పసిఫిక్ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో మలబార్ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాలను భారత్-అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా తొలిసారిగా 1992లో ప్రారంభించాయి. తర్వాత కాలంలో జపాన్ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటుంది. తాజాగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో.. ఈ సంఖ్య నాలుగుకు చేరింది. 2019, సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకూ జపాన్ తీరంలో మలబార్ విన్యాసాలు నిర్వహించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 24వ మలబార్ రెండో దశ యుద్ధ విన్యాసాలు-2020 ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా
ఎక్కడ : ఉత్తర అరేబియా సముద్రం
ఎందుకు : ఇండో-పసిఫిక్ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో
Published date : 18 Nov 2020 05:30PM

Photo Stories