మీథేన్‌పై ఐఐటీ మద్రాస్ పరిశోధనలు
Sakshi Education
దేశ తీర ప్రాంతాల్లోని గ్యాస్ హైడ్రేట్ల నుంచి మీథేన్ తయారీపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్(ఐఐటీ ఎం) విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు.
నేచురల్ గ్యాస్‌ను స్థానికంగా తయారుచేసుకోవడం ద్వారా దిగుమతులు తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నూతన విధానంతో చేపడుతున్న ఈ పరిశోధనల గురించి ‘ఎనర్జీ అండ్ ఫ్యుయల్స్, అప్లైడ్ ఎనర్జీ’ వంటి అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమైనట్లు ఐఐటీ ఎం జూన్ 18న తెలిపింది. ఐఐటీ ఎం ఓషియన్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు డాక్టర్ జితేంద్ర సంగ్వాయ్ ఆధ్వర్యంలో పవన్‌గుప్తా, సి.విష్ణులు ఈ పరిశోధనలు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మీథేన్ తయారీపై పరిశోధనలు
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్(ఐఐటీ ఎం) విద్యార్థులు
క్విక్ రివ్యూ :
ఏమిటి : మీథేన్ తయారీపై పరిశోధనలు
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్(ఐఐటీ ఎం) విద్యార్థులు
Published date : 19 Jun 2019 06:13PM