Skip to main content

మహిళల వంద మీటర్ల పరుగు విజేతగా షెల్లీ

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహించిన మహిళల 100 మీటర్ల పరుగులో జమైకా మేటి మహిళా అథ్లెట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్ విజేతగా నిలిచింది.
ఖతర్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 30న జరిగిన ఫైనల్లో షెల్లీ 10.71 సెకన్లలో గమ్యానికి చేరి ఏకంగా నాలుగోసారి 100 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. డీనా యాషెర్ స్మిత్ (బ్రిటన్-10.83 సెకన్లు) రజతం... మేరీ జోసీ తా లూ (ఐవరీకోస్ట్-10.90 సెకన్లు) కాంస్యం సాధించారు. గతంలో షెల్లీ 2009, 2013, 2015లలో కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు గెలిచింది.

ఫెలిక్స్...12వ స్వర్ణం
అమెరికా అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ 4x400 మిక్స్‌డ్ రిలేలో స్వర్ణ పతకం సాధించింది. దాంతో 11 స్వర్ణాలతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పసిడి పతకాలు గెలిచిన ఉసేన్ బోల్ట్ రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్ బద్దలు కొట్టింది. గతంలో ఫెలిక్స్ 2005 (1), 2007 (3), 2009 (2), 2011 (2), 2015 (1), 2017 (2) ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ పసిడి పతకాలు సాధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-మహిళల వంద మీటర్ల పరుగు విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్
ఎక్కడ : దోహా, ఖతర్
Published date : 01 Oct 2019 05:32PM

Photo Stories