మహిళల రక్షణపై నేతా యాప్ అధ్యయనం
Sakshi Education
పాలనలో ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన నేతా యాప్.. ‘భారత్‌లో మహిళల రక్షణ’ అనే అంశంపై అధ్యయనం నిర్వహించింది.
లక్ష మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో 42 శాతం మంది తాము సురక్షితంగా లేమనీ, లేదా అత్యంత అభద్రతలో జీవిస్తున్నామనీ తెలిపారు. ప్రధానంగా హరియాణా, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలోని మహిళలు తాము ఎక్కువ అభద్రతకు లోనౌతున్నట్టు వెల్లడించారు. దేశం మొత్తంమీద చూస్తే మెట్రోనగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు కనీస భద్రతలేని ప్రాంతమని సర్వేలో వెల్లడయి్యంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో కేవలం 27 శాతం మంది మాత్రమే తాము సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు.
నేతా యాప్ సర్వేలో వెల్లడైన అంశాలు మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో సంస్కరణల ఆవశ్యకతను, కఠినతరమైన చట్టాల అవసరాన్నీ నొక్కిచెపుతున్నాయని నేతా యాప్ వ్యవస్థాపకుడు ప్రథమ్ మిట్టల్ వ్యాఖ్యానించారు.
మహిళలు సురక్షితంగా ఉన్నామని భావిస్తోన్న రాష్ట్రాల ర్యాంకింగ్‌లు....

ర్యాంకు | రాష్ట్రం |
1 | హిమాచల్ ప్రదేశ్ |
2 | త్రిపుర |
3 | కేరళ |
4 | ఆంధ్రప్రదేశ్ |
5 | గుజరాత్ |
6 | తమిళనాడు |
7 | రాజస్తాన్ |
8 | ఉత్తరాఖండ్ |
9 | కర్ణాటక |
10 | తెలంగాణ |
11 | ఒడిశా |
12 | మధ్యప్రదేశ్ |
13 | పంజాబ్ |
14 | అస్సాం |
15 | బిహార్ |
16 | ఉత్తరప్రదేశ్ |
17 | పశ్చిమబెంగాల్ |
18 | జార్ఖండ్ |
19 | ఢిల్లీ |
20 | మహారాష్ట్ర |
21 | ఛత్తీస్‌గఢ్ |
22 | అరుణాచల్ ప్రదేశ్ |
23 | హరియాణా |
Published date : 06 Nov 2019 06:16PM