Skip to main content

మహిళల రక్షణకు మై సర్కిల్ యాప్

మహిళల రక్షణ కోసం ఎయిర్‌టెల్, ఫిక్కీ మహిళా సంస్థ (ఎఫ్‌ఎల్‌ఒ) సంయుక్తంగా ‘‘మై సర్కిల్’’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చాయి.


ఈ యాప్ ద్వారా మహిళలు తాము బాధాకరమైన లేదా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు సహాయం కోసం తమకు తెలిసిన ఐదుగురు సన్నిహితులకు ‘ఎస్‌ఎంఎస్’ పంపించవచ్చు. దీంతో ఎస్‌ఎంఎస్ పంపిన మహిళ గూగుల్‌మ్యాప్ ద్వారా... లొకేషన్‌కు వెంటనే చేరుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, ఉర్దూ, అస్సామీ, ఒరియా, గుజరాతీ భాషల్లో ఎస్‌ఎంఎస్ పంపవచ్చు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మహిళల రక్షణకు మై సర్కిల్ యాప్
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : ఎయిర్‌టెల్, ఫిక్కీ మహిళా సంస్థ (ఎఫ్‌ఎల్‌ఒ)
Published date : 15 Apr 2019 05:48PM

Photo Stories