మహిళల క్రికెట్‌లో తొలి డోపీగా అన్షులా
Sakshi Education
మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ అన్షులా రావు డోపీగా తేలింది. దీంతో భారత మహిళల క్రికెట్‌లో డోపింగ్ పాల్పడిన తొలి క్రికెటర్‌గా అన్షుల అపకీర్తి మూటగట్టుకుంది.
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిథిలోకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చాక బయటపడిన తొలి కేసు ఇదే. మధ్యప్రదేశ్ సీనియర్ మహిళా జట్టు సభ్యురాలైన అన్షుల నమూనాలను పరీక్షించగా ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘19–నోరాండ్రోస్టెరాన్’ తీసుకున్నట్లు వెల్లడైంది. దోహా ప్రయోగాశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఆమె మూత్ర నమూనాల్లో అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ (ఏఏఎస్) ఉన్నట్లు తేలడంతో ఆమెపై సస్పెన్షన్ విధించారు. అయితే ఈ సస్పెన్షన్ ఎంతకాలం అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత మహిళల క్రికెట్‌లో డోపింగ్ పాల్పడిన తొలి క్రికెటర్
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : అన్షులా రావు
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత మహిళల క్రికెట్‌లో డోపింగ్ పాల్పడిన తొలి క్రికెటర్
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : అన్షులా రావు
Published date : 13 Aug 2020 05:23PM