Skip to main content

మహిళల హాఫ్ మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు

మహిళల హాఫ్ మారథాన్ (21.1 కి.మీ) ఈవెంట్‌లో కెన్యా అథ్లెట్ పెరెస్ జెప్‌చిర్‌చిర్ కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేసింది.
Edu newsచెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో సెప్టెంబర్ 5న జరిగిన ఈ పోటీలో 26 ఏళ్ల పెరెస్... గంటా 5 నిమిషాల 34 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని కొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు ఇథియోపియా అథ్లెట్ నెట్‌సానెట్ గుడెటా పేరు మీద ఉండగా... తాజాగా పెరెస్ దాన్ని సవరించింది. 2018 వరల్డ్ హాఫ్ మారథాన్ చాంపియన్‌షిప్‌లో నెట్‌సానెట్ పోటీని గంటా 6 నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
మహిళల హాఫ్ మారథాన్ ఈవెంట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదు
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : కెన్యా అథ్లెట్ పెరెస్ జెప్‌చిర్‌చిర్
ఎక్కడ : ప్రాగ్, చెక్ రిపబ్లిక్
Published date : 08 Sep 2020 12:48PM

Photo Stories