Skip to main content

మహిళా సైనికాధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు

భారత సైన్యంలో పనిచేస్తోన్న మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించడమేనని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది.
Current Affairsఅందులో భాగంగానే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)లోని మహిళా సైనికాధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్(పర్మనెంట్ కమిషన్-పీసీ) ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. శారీరక పరిమితులు, సామాజిక కట్టుబాట్ల పేరుతో సైనిక పటాలాల కమాండింగ్ బాధ్యతల్లో మహిళా అధికారులను నియమించకపోవడం తగదని స్పష్టం చేసింది.

తాజా తీర్పుతో..
సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో... మహిళా సైనికాధికారులకు కమాండ్ పోస్టింగ్‌‌సతో పాటు పురుష అధికారులతో సమానంగా పదోన్నతులు, ర్యాంక్స్, పెన్షన్సు, ఇతర ప్రయోజనాలు దక్కనున్నాయి.

2010 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పుకు సమర్థన
మహిళా సైనికుల విషయంలో వివక్ష తగదంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. పదేళ్లుగా ఈ ఆదేశం అమలుపై కేంద్రం శ్రద్ధ చూపలేదని తప్పు పట్టింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీల ధర్మాసనం ఫిబ్రవరి 17న ఈ తీర్పునిచ్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మహిళా సైనికాధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలి
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : సుప్రీంకోర్టు
Published date : 18 Feb 2020 05:50PM

Photo Stories