మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం
Sakshi Education
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి విజయం సాధించింది.
ఈ మేరకు అక్టోబర్ 24న మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి 161 సీట్లు, కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి 103 సీట్లు గెలుచుకున్నాయి. ఇతరులు 24 సీట్లలో విజయం సాధించారు. బీజేపీ కూటమిలో బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపు సాధించాయి. కాంగ్రెస్ 45, శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకున్నాయి. నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గెలుపొందారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- మొత్తం స్థానాలు 288
- కావాల్సిన మెజారీటి 145
పార్టీ | 2019 | 2014 | మార్పు |
బీజేపీ | 105 | 122 | -17 |
శివసేన | 56 | 63 | -7 |
ఎన్సీపీ | 54 | 41 | +13 |
కాంగ్రెస్ | 45 | 42 | +3 |
సమాజ్‌వాదీ | 02 | 01 | +1 |
ఎస్‌డబ్ల్యూపీ 01 | 00 | +1 |
|
సీపీఎం | 01 | 01 | 0 |
ఎంఐఎం | 2 | 2 | 0 |
ఇతరులు | 10 | 9 | +1 |
స్వతంత్రులు | 12 | 07 | +5 |
Published date : 25 Oct 2019 05:44PM