మగేశ్ చంద్రన్‌కు హేస్టింగ్స్ చెస్ టైటిల్
Sakshi Education
ఇంగ్లండ్‌లోని హేస్టింగ్‌స వేదికగా 95వ ‘హేస్టింగ్స్ ఇంటర్నేషనల్ చెస్’ టోర్నీలో తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ మగేశ్ చంద్రన్ టైటిల్ గెలుచుకున్నాడు.
నిర్ణీత తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి మగేశ్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రొమైన్ ఎడ్యుర్డ్(ఫ్రాన్స్) 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 6.5 పాయింట్లు సాధించిన మరో నలుగురు క్రీడాకారులు మూడో స్థానం పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న మగేశ్ టోర్నీలో అజేయంగా నిలిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో 6 గెలిచి, 3 డ్రా చేసుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 95వ హేస్టింగ్స్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ టైటిల్ విజేత
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : మగేశ్ చంద్రన్
ఎక్కడ : హేస్టింగ్‌స, ఇంగ్లండ్
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : 95వ హేస్టింగ్స్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ టైటిల్ విజేత
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : మగేశ్ చంద్రన్
ఎక్కడ : హేస్టింగ్‌స, ఇంగ్లండ్
మాదిరి ప్రశ్నలు
1. ప్రతిష్టాత్మక ఫిఫా ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును(పురుషుల విభాగంలో) ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు?
1. మొహమ్మద్ సలాహ్
2. ఈడెన్ హజార్డ్
3. లియోనల్ మెస్సీ
4. క్రిస్టియానో రొనాల్డో
- View Answer
- సమాధానం : 3
2. అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నుంచి 2019, సెప్టెంబర్ 25న వెటరన్ పిన్ పురస్కారం అందుకున్న భారత క్రీడాకారిణి ఎవరు?
1. సృ్మతి మంథాన
2. కరణం మల్లీశ్వరి
3. సైనా నెహ్వాల్
4. పీటీ ఉష
- View Answer
- సమాధానం : 4
Published date : 07 Jan 2020 05:33PM