Skip to main content

మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన వ్యక్తి?

దేశంలో ప్రజారవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ‘మెట్రోమ్యాన్’గా గుర్తింపు పొందిన ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ ఈ. శ్రీధరన్ త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.
Current Affairsఈ విషయాన్ని కేరళ బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్ ఫిబ్రవరి 18న వెల్లడించారు. అవసరమైతే కేరళ బీజేపీ తరఫున తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడతానని శ్రీధరన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని తెలిపారు.

రష్మీ సామంత్ రాజీనామా...
ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన మొట్టమొదటి భారతీయురాలు రష్మీ సామంత్(22) తన పదవికి రాజీనామా చేశారు. గతంలో వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలోని లినాక్రె కాలేజీలో ఎనర్జీ సిస్టమ్స్ విభాగంలో ఎమ్మెస్సీ చేస్తున్న రష్మీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విద్యార్థి సంఘం నేతగా ఎన్నికయ్యారు.
Published date : 20 Feb 2021 05:22PM

Photo Stories