మెక్సికో నుంచి 311 మంది భారతీయులు వెనక్కి
Sakshi Education
సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో ఉంటున్న 311 మంది భారతీయులను మెక్సికో అధికారులు వెనక్కి పంపించారు.
ఈ మేరకు ఈ 311 మందిని టొలుకా విమానాశ్రయం నుంచి ప్రత్యేక బోయింగ్ 747 విమానంలో భారత్‌కు తిప్పి పంపినట్లు మెక్సికన్ జాతీయ వలసల సంస్థ (ఐఎన్‌ఎమ్) అక్టోబర్ 17న ప్రకటించింది. మెక్సికన్ సరిహద్దుల నుంచి పెరుగుతున్న వలసలను నివారించేందుకు ఆ దేశంపై టారిఫ్‌ల భారం పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో మెక్సికో ఈ నిర్ణయం తీసుకుంది.
Published date : 18 Oct 2019 05:35PM