Skip to main content

మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తాం: ఆంటిగ్వా

పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.14వేలకోట్లు కుచ్చుటోపి పెట్టిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తామని ఆంటిగ్వా ప్రభుత్వం ప్రకటించింది.
అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తామని, న్యాయపరమైన ప్రక్రియ ముగిశాక భారత్‌కు అప్పగిస్తామని ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనే జూన్ 25న వెల్లడించారు. పీఎన్‌బీలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చాక చోక్సీ 2018, ఏడాది జనవరిలో పరారై ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. అంతకు ముందే 2017 నవంబర్‌లో సిటిజెన్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ (సీఐపీ) కింద ఆంటిగ్వా, బార్బడా జంట దీవుల పౌరసత్వాన్ని తీసుకున్నాడు. లక్ష అమెరికా డాలర్లను ఇన్‌వెస్ట్ చేసి ఆంటిగ్వా, బార్బడా పౌరసత్వాన్ని ఎవరైనా తీసుకోవచ్చు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తాం
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనే
Published date : 26 Jun 2019 06:08PM

Photo Stories