Skip to main content

మేరా రేషన్ మొబైల్ యాప్ ప్రారంభం

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని అమలు చేసే ప్రణాళికలో భాగంగా... కేంద్రప్రభుత్వం మార్చి 11న ‘‘మేరా రేషన్ మొబైల్ యాప్’’ను ప్రారంభించింది.
Current Affairs
ప్రస్తుతం ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌... జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళే రేషన్‌ కార్డ్‌ హోల్డర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం తెలిపింది.

నాలుగు రాష్ట్రాలు మినహా...
ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ పథకంలో భాగస్వామ్యం అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన నాలుగు రాష్ట్రాలైన అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల అనుసంధానం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని వివరించింది. ప్రస్తుతం వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ వ్యవస్థలో దేశంలోని దాదాపు 69 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులు ఉన్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ పథకాన్ని అమలు చేసే ప్రణాళికలో భాగంగా...
Published date : 13 Mar 2021 06:24PM

Photo Stories