మేఘా ఇంజనీరింగ్ కు జోజిల్లా టన్నెల్ పనులు
Sakshi Education
నిర్మాణ రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది.
హిమాలయాల్లోని జమ్మూకశ్మీర్–లద్దాఖ్‌లోనిజోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణ పనుల ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని నేషనల్ హైవేస్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆగస్టు 21న వెల్లడించింది. ప్రాజెక్టు వ్యయం రూ.4,509.50 కోట్లుగా ఉందని పేర్కొంది. ప్రాజెక్టును 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించింది. మొత్తం పనిని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా చేపట్టాల్సి ఉంటుంది.
చదవండి: ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన
జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లద్దాఖ్ లేహ్ ప్రాంతంలో ఉన్న రహదారిని ఏడాదిలో 6నెలలపాటు పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్‌కు ఈ రహదారి టన్నెల్ నిర్మించాలని ప్రతిపాదించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణ పనుల ప్రాజెక్టు కైవసం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు :మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్)
ఎక్కడ : జమ్మూకశ్మీర్–లద్దాఖ్

Published date : 24 Aug 2020 08:01PM