మేధా రైల్‌కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ
Sakshi Education
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో సుమారు 106 ఎకరాల విస్తీర్ణంలో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ స్థాపిస్తున్న మేధా రైల్‌కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ జరిగింది.
తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డితో కలసి ఆగస్టు 13న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ప్రైవేటు సెక్టార్‌లో మేధా సంస్థ.. భారతదేశపు అతిపెద్ద రైల్‌కోచ్ ఫ్యాక్టరీగా అవతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 1984లో స్థాపించిన ఈ సంస్థ.. ప్రస్తుతం రూ.21 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరుకుందని వివరించారు.
మేధా రైల్‌కోచ్ ఫ్యాక్టరీ ఏడాదికి 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్స్ చొప్పున తయారు చేస్తుందని ఆ సంస్థ ఎండీ యడవెల్లి కశ్యప్‌రెడ్డి తెలిపారు. ప్రత్యక్షంగా వెయ్యి, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మేధా రైల్‌కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ :కొండకల్, శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

Published date : 15 Aug 2020 05:44PM