Skip to main content

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం

తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 5న ఘనంగా ఫ్రారంభమైంది.

Current Affairs


కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొత్తగూడ మండలం పూను గొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూ రునాగారం మండలం కొండాయి నుంచి గోవింద రాజులు సైతం మేడారం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నంటింది. జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్కను గద్దెలపైకి ఫిబ్రవరి 6న చేరుస్తారు. మేడారం సమీపంలోని చిలకల గుట్టపై నుంచి సమ్మక్కను తీసుకొస్తారు.

తెలంగాణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జరిగే ఈ జాతరను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహిస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్తులు వస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎక్కడ : మేడారం, తాడ్వాయి మండం, ములుగు జిల్లా, తెలంగాణ
Published date : 06 Feb 2020 06:06PM

Photo Stories