Skip to main content

మధ్యవర్తి హోదా కోల్పోయిన సోషల్‌ మీడియా సంస్థ?

‘మధ్యవర్తి హోదా’తో భారత్‌లో లభిస్తున్న చట్టబద్ధ రక్షణను నూతన ఐటీ నిబంధనల అమలు చేయని కారణంగా ట్విట్టర్‌ కోల్పోయింది.
Current Affairs ఇక తమ ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్‌ అయ్యే చట్టవ్యతిరేక సమాచారానికి సంబంధించి ట్విట్టర్‌ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) కింద శిక్షకు గురయ్యే అవకాశం కూడా ఉంటుందని ఐటీ అధికారులు జూన్‌ 16న వెల్లడించారు. ట్విట్టర్‌కు ఉన్న ఇంటర్మీడియరీ హోదా, తద్వారా లభించిన రక్షణ మినహాయింపులు.. గడువులోపు ఐటీ నిబంధనలను అమలు చేయని కారణంగా.. మే 26 నాటికే ముగిశాయని తెలిపారు.

మధ్యవర్తి హోదా ఉంటే...
మధ్యవర్తి హోదా ఉంటే... వినియోగదారులు చేసే పోస్టులకు సామాజిక మాధ్యమాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. పరువు నష్టం కేసులు, క్రిమినల్, కేసుల నుంచి వాటికి రక్షణ ఉంటుంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : మధ్యవర్తి హోదా కోల్పోయిన సోషల్‌ మీడియా సంస్థ?
ఎప్పుడు : జూన్‌ 16
ఎవరు : ట్విట్టర్‌
ఎక్కడ : భారత్‌
ఎందుకు : భారత ప్రభుత్వం తెచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు చేయని కారణంగా...
Published date : 17 Jun 2021 08:50PM

Photo Stories