మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్
Sakshi Education
మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ మార్చి 23న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ఆయనతో రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మధ్యప్రదేశ్‌లో నాలుగో సారి సీఎం పదవి స్వీకరించిన వ్యక్తిగా చౌహాన్ రికార్డు సృష్టించారు.
ఎన్‌పీఆర్, జనగణన వాయిదా
దేశమంతా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 1 నుంచి నిర్వహించాల్సిన జాతీయ పౌరపట్టిక (ఎన్పీఆర్), మొదటి దశ జనగణనలు ఆగిపోయాయి. ఈ కార్యక్రమాలు మొదటి దశ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగాల్సి ఉంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ రెండు కార్యక్రమాలు నిలిచిపోతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : శివరాజ్ సింగ్ చౌహాన్

Published date : 27 Mar 2020 06:56PM