మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోతీలాల్ వోరా కన్నుమూత
కోవిడ్-19 అనంతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ న్యూఢిల్లీలోని ఓక్లాలో ఉన్న ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో డిసెంబర్ 21న తుదిశ్వాస విడిచారు. చత్తీస్‌గఢ్‌లోని దర్గ్‌లో వోరా అంత్యక్రియలు నిర్వహించారు.
1928, డిసెంబర్ 28న రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాలో జన్మించిన మోతీలాల్ వోరా పాత్రికేయుడిగా తన కెరీర్ ప్రారంభించారు. మధ్యప్రదేశ్ నుంచి తొలిసారిగా 1972లో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో గెలుస్తూ 1992 వరకు శాసన సభ్యుడిగా కొనసాగారు. 1993లో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. 1985 నుంచి 1988 వరకు.. 1989లోనూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. 2020, ఏప్రిల్ వరకు ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : మోతీలాల్ వోరా(92)
ఎక్కడ : ఎస్కార్ట్స్ ఆసుపత్రి, ఓక్లా, న్యూఢిల్లీ
ఎందుకు : కోవిడ్-19 అనంతర అనారోగ్య సమస్యల కారణంగా