మద్రాస్ హైకోర్టు సీజే రాజీనామా
Sakshi Education
మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.కె. తహిల్ రమణి రాజీనామాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబర్ 20న ఆమోదం తెలిపారు.
రమణి స్థానంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వినీత్ కొఠారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 6న రమణి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సెప్టెంబర్ 6 నుంచే ఆమె రాజీనామా అమల్లోకి వచ్చినట్లయింది.
2018, ఆగస్టు 8న తహిల్ రమణిని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019, ఆగస్టు 28న ఆమెను మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రమణి కొలీజియాన్ని కోరినప్పటికీ కొలీజియం తిరస్కరించింది. 2020 ఏడాది అక్టోబరులో రమణి పదవీ విరమణ పొందాల్సిఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : జస్టిస్ వి.కె. తహిల్ రమణి

Published date : 21 Sep 2019 06:40PM