Skip to main content

మానసిక ఆరోగ్యం కోసం కేంద్రం ప్రారంభించిన హెల్ప్‌లైన్ పేరు?

ప్రజల్లో ఒత్తిళ్లతో తలెత్తిన మానసికపరమైన ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. మానసికంగా దృఢంగా ఉంచి 24x7 ఉచితంగా సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.
Edu news‘కిరణ్’(18005990019) అనే పేరుతో ఏర్పాటుచేసిన ఈ హెల్ప్‌లైన్‌ను సెప్టెంబర్ 7న కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్ ప్రారంభించారు. ఈ హెల్ప్‌లైన్ వివరాలను మంత్రి వెల్లడించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
  • ఫస్ట్ ఎరుుడ్, ఒత్తిడి నివారణ, మానసిక అనారోగ్య సమస్యల పరిష్కారం, ఆశావహ దృక్పథం పెంపు తదితర సేవలను కిరణ్ హెల్ప్‌లైన్ అందిస్తుంది.
  • ఆయా వ్యక్తులు, బాధిత కుటుంబాలు, పునరావాస కేంద్రాలు, ఆస్పత్రులు, ఇలా ఎవరైనా సహాయం తీసుకోవచ్చు.
  • తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ తదితర 13 భాషల్లో కౌన్సెలింగ్ ఇస్తారు.
  • 668 మంది మానసిక నిపుణులు, 660 మంది క్లినికల్ నిపుణులు కిరణ్‌లో పని చేస్తుంటారు.
  • దేశంలో ఎక్కడి నుంచైనా మొబైల్, ల్యాండ్‌లైన్‌తో కాల్ చేయొచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: కిరణ్(18005990019) అనే పేరుతో హెల్ప్‌లైన్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్
ఎందుకు : ప్రజల్లో ఒత్తిళ్లతో తలెత్తిన మానసికపరమైన ఇబ్బందులను తొలగించేందుకు
Published date : 08 Sep 2020 05:26PM

Photo Stories