Skip to main content

మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ సుముఖత

బ్యాంకుల వద్ద వేల కోట్ల అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ సుముఖత వ్యక్తం చేసింది.
ఈ మేరకు బ్రిటన్ హోం మంత్రి సాజిద్ జావీద్ ఫిబ్రవరి 3న సంబంధింత పత్రాలపై సంతకం చేశారు. అయితే ఈ నిర్ణయంపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఫిబ్రవరి 4 నుంచి 14 రోజులపాటు మాల్యాకు గడువుంది. మాల్యా భారత్‌లో ఓ కోర్టు కేసును ఎదుర్కోవాల్సి ఉందనీ, ఆయనను భారత్‌కు తిరిగి పంపించాలని తీర్పునిస్తూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు 2018, డిసెంబర్ 10న తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సుముఖత
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : బ్రిటన్
Published date : 05 Feb 2019 05:32PM

Photo Stories