మాలీలో జాతీ వైషమ్యాలు
Sakshi Education
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలీలో జాతుల మధ్య వైషమ్యాలు భగ్గుమన్నాయి.
కౌన్‌డో జిల్లా సొబానే-కో గ్రామంలో డోగాన్ జాతి ప్రజలపై జూన్ 9న విరోధులు విరుచుకుపడి మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో దాదాపు వంద మంది మృతి చెందారని భావిస్తున్నారు. దుండగులు డోగాన్ జాతీయుల ఇళ్లపై సామూహికంగా దాడి చేసి దొరికినంత సొమ్మును దోచుకొని, ఆస్తులను ధ్వంసం చేశారు. ఆనవాళ్లు దొరకకుండా శవాలను కాల్చివేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
Published date : 11 Jun 2019 06:31PM