Skip to main content

మాజీ వికెట్‌ కీపర్ జాక్‌ ఎడ్వర్డ్స్ క‌న్నుమూత

న్యూజిలాండ్‌ క్రికెట్‌లో బిగ్‌ హిట్టర్‌గా ఖ్యాతిగాంచిన మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌(64) కన్నుమూశారు.
Current Affairs

ఎడ్వర్డ్స్‌ మరణించిన విషయాన్ని ఆ దేశ సెంట్రల్‌ డిస్ట్రిక్స్‌ క్రికెట్‌ అసోసియేషన్ ఏప్రిల్ 6న వెల్లడించింది. అయితే ఆయన మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కివీస్‌ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానుల్ని అలరించిన ఎడ్వర్డ్స్ 1974-85 మధ్య కాలంలో క్రికెట్‌లో తనదైన ముద్రవేశారు. ఆరు టెస్టు మ్యాచ్‌లు, ఎనిమిది అంతర్జాతీయ వన్డేలతోపాటు 64 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లను ఆడాడు. 1978లో ఆక్లాండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలు సాధించడం అతని కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచింది.


క్విక్ రివ్యూ :

ఏమిటి : న్యూజిలాండ్‌ మాజీ వికెట్‌ కీపర్ క‌న్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : బ్యాట్స్‌మన్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌(64)
Published date : 06 Apr 2020 06:40PM

Photo Stories