మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
Sakshi Education
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీనటుడు నారమల్లి శివప్రసాద్ (68) కన్నుమూశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సెప్టెంబర్ 21 తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్ 1951 జూలై 11న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పూటిపల్లిలో జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అభ్యసించిన ఆయన కొంతకాలం వైద్యుడిగా సేవలందించారు. 1999లో సత్యవేడులో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి సమాచార, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. 2009, 2014లో చిత్తూరు ఎంపీగా గెలిచారు. 2019లో ఓటమి పాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ సమావేశాల సమయంలో శివప్రసాద్ రోజుకో వేషధారణతో నిరసన తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాజీ ఎంపీ, సినీనటుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : నారమల్లి శివప్రసాద్ (68)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : అనారోగ్యం కారణంగా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ సమావేశాల సమయంలో శివప్రసాద్ రోజుకో వేషధారణతో నిరసన తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాజీ ఎంపీ, సినీనటుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : నారమల్లి శివప్రసాద్ (68)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 23 Sep 2019 05:27PM