లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు
Sakshi Education
కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘ట్రిపుల్ తలాక్’ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జూన్ 21న ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమనీ, దీనిపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌చేశాయి. ఈ సందర్భంగా బిల్లుకు అనుకూలంగా 186 మంది సభ్యులు మద్దతు తెలపగా, 74 మంది ఎంపీలు వ్యతిరేకించారు.
టిపుల్ తలాక్ బిల్లును 2018, సెప్టెంబర్‌లో ఓసారి, 2019, ఫిబ్రవరిలో మరోసారి కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లోక్‌సభలో ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019(ట్రిపుల్ తలాక్ బిల్లు) ఎప్పుడు : జూన్ 21
ఎవరు : కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్

Published date : 22 Jun 2019 05:40PM