Skip to main content

లోక్‌మాన్య తిలక్‌ జాతీయ అవార్డుకి ఎంపికైన వ్యక్తి?

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) చైర్మన్‌ సైరస్‌ పూనావాలా ప్రతిష్టాత్మక లోక్‌మాన్య తిలక్‌ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.
2021 ఏడాదికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లు లోక్‌మాన్య తిలక్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు దీపక్‌ తిలక్‌ ఆగస్టు 1న ప్రకటించారు. ఆగస్టు 13న ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అవార్డుతో పాటు రూ. లక్ష నగదు, మెమెంటో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్‌ 19 మహమ్మారి సమయంలో ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని ఈ అవార్డును ప్రకటిస్తున్నట్లు వివరించారు. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ ద్వారా ఆయన ఎన్నో ప్రాణాలను కాపాడారని కొనియాడారు. తిలక్‌ జాతీయ అవార్డును గతంలో మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, ఏబీ వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ వంటి వారు అందుకున్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : లోక్‌మాన్య తిలక్‌ జాతీయ అవార్డు–2021కి ఎంపికైన వ్యక్తి?
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) చైర్మన్‌ సైరస్‌ పూనావాలా
ఎందుకు : కోవిడ్‌ 19 మహమ్మారి సమయంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా...
Published date : 02 Aug 2021 06:00PM

Photo Stories